నా జీవితంలో నేను ఎదుర్కొన్న పరిస్థితులు దృష్ట్యా నాకనిపించినవి ఓ కవిత రూపంలో రాసాను. నాకు నిజంగా కవితలు రాయడం రాదు, శ్రీ శ్రీ మహాప్రస్థానం చదివాను ఆ పుస్తకం యొక్క ప్రభావం నామీద ఎక్కువగా ఉండటం వల్లనా ఇలా రాయాలి అని అనిపించి రాసాను. ఏ ఒక్కరిని ఉద్దేశించి రాయలేదు ఒకవేళ మీకు అలా అనిపిస్తే క్షమించగలరు... నేను, నా సమాజం ఎవరు చెప్పారు, మన జీవితం మన చేతిలోనే ఉంటుంది అని ఎవరు చెప్పారు, మన భవిష్యత్ కు బాటలు మనమే వేసుకోవాలి అని ఎవరు చెప్పారు, మన ఆలోచనలే మన భవిష్యతును నిర్మిస్తాయి అని ఎవరు చెప్పారు, పని మాత్రమే చేయాలి అని, ఫలితం పైవాడు ఇస్తాడు అని ఎవరు చెప్పారు, పని మీద మనసు లగ్నం చేసి చేయాలి అని ఎవరు చెప్పారు, నీ ఆలోచనలు గుర్తిస్తారు అని,నీకు తోడుగ వస్తారు అని ఎవరు చెప్తారు, జీవితం అందరి సరదా తీరుస్తుంది అని ఎవరు చెప్తారు, కాలం తన పని తాను చేసుకుపోతుంది అని, లాభ నష్టాలతో తనకు ఏమాత్రం పని లేదు అని ఎవరు చెప్తారు, సమాజం తన గమ్యానికి, నైతిక విలువలకి అడ్డుగా వస్తుంది అని ఎవరు చెప్తారు, నేను...
i have taken this photo with my moto xplay mobile..............
ReplyDelete